ANDHRA TIMES NEWS - NATIONAL / ప్రకాశం : ప్రకాశం జిల్లా :: జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామా దగ్గర ఉగ్రవాదులు అతి కిరాతంగా భారతీయులను బలితీసుకున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా కంభం మండల ముస్లిం జే ఏ సి ఆధ్వర్యంలో శుక్రవారం నమాజ్ తరువాత నల్ల బ్యాడ్జిలు ధరించి శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది.కంభం పట్టణము లోని 15 మసీదుల నుండి వచ్చిన 1000 మంది ముస్లిం సోదరులు జామియా మసీదు నుండి బస్టాండ్ మసీదు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు అంటూ చేశారు. మృతుల పవిత్ర ఆత్మకు శాంతి కలిగేలా ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో మండలం లోని దాదాపు 1000 మంది ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ANDHRA TIMES NEWS