ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : గిద్దలూరు నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ గౌ. శాసనసభ్యులు మరియు ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి "క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు" తెలిపారు. క్రైస్తవ సోదరులకు కూటమి ప్రభుత్వం క్రిస్మస్ పర్వదినం సందర్బంగా, క్రిస్మస్ కానుకగా రాష్ట్రంలోని 8427 మంది ఫాస్టర్లకు గౌరవ వేతనం కింద రూ. 51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని, సూపర్ సిక్స్ పథకాలతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు అందచేస్తున్నామన్నారు. చర్చీల మరమ్మత్తులకు కూటమి ప్రభుత్వం ఆర్ధిక సహకారం అందిస్తుందని, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, క్రైస్తవ కుటుంబాలన్నీ ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నాయని వారు పేర్కొన్నారు.. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు..
Admin
ANDHRA TIMES NEWS