ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : అక్క, తమ్ముడు మధ్య గొడవలో అక్క డి .అంజలి బాయి(16) మైనర్ పొలానికి వెళ్లి ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యర్రగొండపాలెం మండలంలోని దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం పాలుట్ల గ్రామంలో చోటుచేసుకుంది.పోలీసుల తెలిపిన వివరాల మేరకు డి అంజలి బాయి ఇంటి అవసరాల కోసం గ్రామంలో ఓ బావి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకుంటూ కాలం గడుపుకునేవారు సోమవారం అక్క తమ్ముడు మంత్రు నాయక్ ని బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకొని రా అని చెప్పగా తమ్ముడు వినకపోవడంతో మనస్థాపనకు గురై పొలాల్లోకి వెళ్లి ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ అమ్మ మంగ్లీ బాయి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చౌడయ్య తెలిపారు.
Admin
ANDHRA TIMES NEWS