ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : మార్కాపురం పట్టణంలో శ్రీ సాయి బాలాజీ హైస్కూల్ నందు సబ్ కలెక్టర్ శివ రామి రెడ్డి చేతుల మీదుగా పి.వి సింధూ ఇండోర్ షటిల్ కోర్టును ప్రారంభించటం జరిగింది. ఈ సంధర్భంగా సబ్ కలెక్టర్ పాఠశాల నుండి స్టేట్ కు సెలెక్ట్ అయినటు వంటి త్రిభువన మరియు అనిలాష్ లను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు క్రీడలలో పాల్గొని మంచి విజయాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పి ప్రకాశరావు, ప్రిన్సిపల్ సయ్యద్ మస్తాన్ వలి, పాఠశాల పి.డి సయ్యద్ వలి , పి.ఈ.టీ వెంకటేశ్వర్లు, ఇంచార్జీలు, ఉపాధ్యాయులు, విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
ANDHRA TIMES NEWS