ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : వందల ఏళ్ల నాటి ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంభం చెరువు అభివృద్ధికి తొలి అడుగు పడింది. ప్రకాశం జిల్లా లోని కంభం చెరువును టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి విన్నవించగా టూరిజం కేంద్రంగా మారేందుకు సన్నాహాలు మొదలయయ్యాయి. మంగళవారం నాడు ప్రకాశం జిల్లా టూరిజం అధికారి అద్దంకి రమ్య తో కలిసి కంభం చెరువును గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. టూరిజం అధికారిణి తో కంభం చెరువు లో బోటు లో తిరిగి పరిశీంచారు. *ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరొ ఏడాదిలోగా పూర్తి స్థాయిలో టూరిజం కేంద్రంగా కంభం చెరువు మారనుందని తెలిపారు. ఏది ఏమైనా ఎంత మంది నాయకులు మారిన కానీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తో పట్టుదలతో కంభం ప్రజల దశబ్దాల నాటి కల నెరవేరబోతుందని నియోజకవర్గ ప్రజలు హర్షము వ్యక్తం చేస్తున్నారు.
Admin
ANDHRA TIMES NEWS