ANDHRA TIMES NEWS - News / మార్కాపురం : మార్కాపురం జిల్లా :: కంభం :: కంభం స్థానిక రావిపాడు రోడ్డు లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహం 1 ను గురువారం రాత్రి మార్కాపురం సబ్ కలెక్టర్ ఎం. వెంకట శివరామిరెడ్డి ఆకస్మిక తనీఖీ చేసారు. అనంతరం ఆయన 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ మరియు శాలువాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం వసతి గృహములకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదవ తరగతి భవిష్యత్తుకు పునాది అని దీన్ని పటిష్టం గా నిర్మించుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు.తాను కూడా 12 సంవత్సరములు హాస్టల్లో ఉండి చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తు చేసుకున్నారు. చదివే ఆయుధంగా చేసుకొని నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించిరి తదనంతరం, నివాస గదులను టాయిలెట్స్,వంటగదిని త్రాగునీరు భోజన సౌకర్యాలు పరిశీలించి హాస్టల్ హాస్టల్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసినారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి కసిరెడ్డి కోటిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
ANDHRA TIMES NEWS