ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక విద్య వనరుల కేంద్రం, వెలుగు క్రాంతి కార్యాలయాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్యాంగానికి విరుద్ధంగా జరగడం చర్చనీయాంశం అయింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం అధికారులు చేయాలి అలాకాకపోగా అధికారులే దగ్గరుండి మరీ ఎంపిపి సూరెడ్డి భులక్ష్మీ చేత ఆవిష్కరింప చేయడం ఏంటని, అధికారులు వారికి తొత్తులుగా మారి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంఈఓ కార్యాలయం నందు ఎంఈఓ 2 అచ్యుత సుబ్బారావు, వెలుగు క్రాంతి కార్యాలయంలో ఏపిఎం రమేష్ ఇందుకు నిదర్శనం...రూల్స్ ప్రకారం వారు జెండా ఆవిష్కరణ చేయాలి కానీ ఇక్కడ మాకు నో రూల్స్.. అంతా మా ఇష్టం అన్న చందంగా మారింది... *ఇది ఇలా ఉంటే ఒక మండల విద్యా శాఖా అధికారి అయ్యుండి గణతంత్ర దినోత్సవం నాడు ఆరోగ్యం బాగాలేదని దేవరకొండ సుజాత సెలవు పెట్టడం చర్చనీయాంశమైంది*
Admin
ANDHRA TIMES NEWS