Tuesday, 17 March 2026 01:07:11 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

కుట్టుమిషన్ కుట్టిన ఎమ్మెల్యే

మహిళా సాధికారతే ఎన్ డి ఎ కూటమి లక్ష్యం

Date : 24 April 2025 01:03 PM Views : 930

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా :: గిద్దలూరు::*మహిళా సాధికారతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ పైన ఉన్నటువంటి సచివాలయ భవనంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాన్ని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని సీఎం నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదింటి మహిళలు ఆర్ధికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో వారికి కుట్టు మిషన్ల శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని నేడు గిద్దలూరు నియోజకవర్గంలో ప్రారంభించటం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ ఒక్క హామీని నెరవేరుస్తామని దీపం పథకం ద్వారా ఇప్పటికే ఉచిత సిలిండర్లు అందచేస్తున్నామని, జూన్ నాటికీ ప్రతీ ఒక్కరికి తల్లికి వందనం ద్వారా ప్రతీ తల్లికి నగదును వారి అకౌంట్లలో జమ చేస్తామని, గత పాలకుల లాగా మాటల ప్రభుత్వం కాదని, చెప్పిన ప్రతీ పథకాన్ని అమలు చేసి తీరుతామన్నారు..* *ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, సొసైటీ బ్యాంకు చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులు, తాహసిల్దార్ ఆంజనేయ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్, మండల, పట్టణ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :