Tuesday, 17 March 2026 01:03:58 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

ప్రజా సమస్యపై ప్రజా సంకల్ప వేదిక పోరాటం

- పోలీస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు --- - హైకోర్టు న్యాయవాది మదిరే రంగసాయిరెడ్డి.

Date : 21 September 2025 11:12 AM Views : 299

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రజలకు పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం పోయిందని,తర్లుపాడు పోలీసులను చూస్తుంటే ప్రజలు భయపడి పోతున్నారని,సోమవారం ప్రజా సంకల్ప వేదిక ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయ సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో,ఓ హైకోర్టు అడ్వకేట్ దగ్గర కూడా ఫిర్యాదు చేయడానికి ప్రజలు భయపడుతున్న తీరును చూస్తే ప్రజలను పోలీసులు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో అర్థమవుతుందని,ప్రజా సంకల్ప వేదిక అధ్యక్షులు,హైకోర్టు న్యాయవాది మధిరె రంగసాయిరెడ్డి తర్లుపాడు పోలీసులు ప్రజల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తర్లుపాడు గ్రామానికి చెందిన మోహిద్దిన్ భాష అనే ఫిర్యాదు దారుడు,తమ కారును చెర్లో నాగులవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు ఉరఫ్ కిట్టు అనే వ్యక్తి నంద్యాలకి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని వెళ్లి వస్తానని తీసుకువెళ్లి తమ కారును మాయం చేసి, తమకు అప్పగించడం లేదని, ఇప్పటివరకు కారు జాడ తెలియదని,నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేస్తే,నంద్యాల పోలీసులు మీ పరిధిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని చెప్పడంతో,నాలుగు నెలల నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తాము చేస్తున్న ఫిర్యాదును ఎందుకు నమోదు చేయడం లేదో తర్లుపాడు పోలీసులు సమాధానం చెప్పాలన్నారు.కేసు నమోదు చేసుకోకపోగా తమ కుమారుడు ఫిరోజ్ ను నువ్వే కారును అమ్ముకొని నాటకాలు చేస్తున్నావా.. బెల్టు ఇరుగుద్ది అని అసభ్యంగా బెదిరించడం ఏంటని, ప్రజల మీద మీ పెత్తనం ఏంటని, ప్రజల ప్రాథమిక హక్కులను తర్లుపాడు ఎస్సై కాలరాస్తున్నారని, తర్లుపాడులో రాజ్యాంగం కుంటుపడిందని,రాజ్యాంగం లోని ఆర్టికల్ 311 ప్రకారం అవినీతికి పాల్పడిన ఏ అధికారి అయినా సరే, పై అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తించిన అధికారులను,తప్పు చేసిన ఏ అధికారిని తాము వదల బోమని, ప్రజలకు న్యాయం చేయడానికి చట్టపరమైన ఏ విధమైన చర్యల కైనా తమ సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.అనంతరం ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఫిర్యాదిదారులకు న్యాయపరమైన సలహాలు అందించి వారి నుంచి అర్జీలను తీసుకున్నారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :