ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : యర్రగొండపాలెం మండలంలోని గొల్లవిడిపి గ్రామంలో భార్య చికెన్ వండలేదని మనస్థాపనికిగురై చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఇళ్ల లక్ష్మీనారాయణ (25) పొలానికి వెళ్లి ఎవరు లేని సమయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు లక్ష్మీనారాయణ భార్యకు, మృతునికి రోజు పచ్చడి పెడతావ్ అంటూ భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది.నిన్న ఆదివారం కావడంతో లక్ష్మీనారాయణకు చికెన్ తినాలనిపించింది. కానీ తన భార్య చికెన్ వండలేదని మనస్థాపానికి గురై ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు.మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎర్రగొండపాలెం పట్టణ ఎస్సై చౌడయ్య తెలిపారు.
Admin
ANDHRA TIMES NEWS