Tuesday, 17 March 2026 01:02:29 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

హైస్కూల్ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

విద్యార్థి ప్రయోజకుడు కావాలంటే గురువు పాత్ర కీలకం - ముత్తోజు సుధాకర్, ప్రధానోపాధ్యాయుడు,తర్లుపాడు

Date : 12 September 2025 08:34 AM Views : 534

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : తర్లుపాడు మండల స్థాయిలో ఉత్తమ అవార్డు గ్రహీతలకు అభినందన సభలో భాగంగా తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముత్తోజు సుధాకర్ మాట్లాడుతూ అన్ని వృత్తుల్లో కెల్లా పరమ పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. గొప్ప దానం విద్యా దానం. దేశ అభివృద్ధిలో పాలుపంచుకునే భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉంది. ఉపాధ్యాయులు అంటే తరాల తయారీదారులు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది. తనకంటే ఎదిగిన వారిని చూస్తే అసూయ కలగడం మానవ నైజం కానీ ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం తన శిష్యులు ఎంత ఎదిగితే ఆ ఉపాధ్యాయుడు అంత సంతోషపడతాడని, అటువంటి ఉపాధ్యాయులను సత్కరించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా డిప్యూటీ డిఈఓ శ్రీనివాసరావు, మార్కాపురం యంఈఓ సుబ్రహ్మణ్యం పాల్గొనగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు అయిన కె బ్రహ్మనందం తర్లుపాడు జడ్పిహెచ్ఎస్, పఠాన్ రెహ్మాన్ ఖాన్ జడ్పిహెచ్ఎస్ తుమ్మలచెరువు, చేగిరెడ్డి రామిరెడ్డి లూథరన్ ఉన్నత పాఠశాల తర్లుపాడు, పెరుమాళ్ళ కోటిమోహన్ జడ్పిహెచ్ఎస్ చెన్నారెడ్డి పల్లి, వి లక్ష్మీ కుమారి జడ్పిహెచ్ఎస్ కేజీ పాడు, జి రవికుమార్ జడ్పిహెచ్ఎస్ తాడివారి పల్లి, కె నరసింహులు జడ్పిహెచ్ఎస్ నాగేళ్ళముడుపు, పి సంధిప్తి కెజిబివి కలుజువ్వలపాడు, కె మురళి మోహన్ జడ్పిహెచ్ఎస్ మీర్జెపేట, జి రాజగోపాల్ జడ్పిహెచ్ఎస్ పోతలపాడు లను మండల ఉత్తమ అవార్డు గ్రహితలు గా ఎన్నుకొని అవార్డు, మెమెంటో , శాలువాలతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు , మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :