Tuesday, 17 March 2026 01:04:28 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు

Date : 31 December 2025 07:01 PM Views : 133

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు... మార్కాపురం జిల్లా వాసులకు కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు... సయ్యద్ జావీద్ అన్వర్.... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కామశిక్షణ కమిటీ సభ్యులు. ప్రకాశం జిల్లా మార్కాపురం పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ మార్కాపురం జిల్లా ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు సయ్యద్ జావిద్ అన్వర్ బుధువారం న ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత సయ్యద్ జావీద్ అన్వర్ మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా కావాలనే లక్ష్యంతో గత 10 సంవత్సరాలనుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల గొంతుకను ప్రభుత్వాలకు వినిపించేలా చేశామని పేర్కొన్నారు..కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయటం హర్షించదగ్గ నిర్ణయమని తెలిపారు..ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు విద్య,ఉపాధి అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.ఇకపై మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పెద్దఎత్తున పరిశ్రమలు,పెట్టుబడులు రానున్నాయని,కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పడి యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.పారిశ్రామిక అవకాశాలు అధికంగా ఉన్న దొనకొండ,కురిచేడు మండలాలను నూతన జిల్లాలో కలిపితే ఇంకా ఈ నూతన జిల్లా అభివృద్ధి చెందేదని ఆశాభావం వ్యక్తపరిచారు..మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :