ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ఇటీవలే తల్లిదండ్రులు వదిలేసిన పసికందును చూడడానికి లిటిల్ స్టార్స్ హాస్పిటల్ ను రాష్ట్ర బీ సీ ప్రధాన కార్యదర్శి జాడి శ్వేత సందర్శించారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ, ఇది ఒక అమానుష ఘటన అని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృత్తం కాకుండా మహిళలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బాలుడి తల్లిదండ్రులను వీలైనంత త్వరగా గుర్తించి వారికి అప్పగించడమో లేదా ప్రభుత్వం వారు సంరక్షణ తీసుకోవడమే జరగాలని, మేమంతా బాబుకు అండగా ఉంటామని తెలిపారు. బాబుకు అవసరమైన వైద్యాన్ని అందినందుకు లిటిల్ స్టార్స్ హాస్పిటల్ డా.సాయి శిశిర్ మరియు సిబ్బందిని అభినందించారు. సమాజంలోని ప్రతి పిల్లవాడు మన భవిష్యత్తు. వారిని ఆదుకోవడం మనందరి బాధ్యత.”అలాగే, సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలందరినీ ప్రోత్సహించే దిశగా ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ కార్యకర్తలు పాల్గొని బాలుడికి ప్రస్తుతం అవసరమైన సదుపాయాలను సమకూర్చారు.
Admin
ANDHRA TIMES NEWS