ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి భార్య వెంకట మాధవిని కిరాతకంగా హతమార్చాడు. అనుమానంతో భార్యను హత్య చేసి భార్య శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్ లో ఉడకపెట్టాడు. తర్వాత ఆ ముక్కలను రోకల బండతో పొడిచేసి డ్రైనేజీ కాలవలో పారపోశాడు. ఈ దారుణ సంఘటన తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మీర్ పేట పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కూతురు కనిపించకపోవడం మాధవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Admin
ANDHRA TIMES NEWS